Crazy fellow: ఓటీటీలో ఆది క్రేజీ ఫెలో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ, మిర్నామేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘క్రేజీ ఫెలో’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
హైదరాబాద్: ఆది సాయికుమార్ (Aadi Saikumar) కథానాయకుడిగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘క్రేజీ ఫెలో’. గత డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆది సరసన దిగంగన సూర్యవంశీ, మిర్నా మేనన్ నటించారు.
కథేంటంటే: అభిరామ్ (ఆది సాయికుమార్) (Aadi Saikumar) ఓ క్రేజీ కుర్రాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అన్నావదినల సంరక్షణలో చాలా గారాబంగా పెరుగుతాడు. పబ్బులు, పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ సరదాగా తిరగడమే తప్ప జీవితంలో అతడికంటూ పెద్ద లక్ష్యాలేమీ ఉండవు. దీనికి తోడు తనకి కాస్త తొందరపాటు ఎక్కువ. దానివల్ల తను అనవసరమైన సమస్యల్లో చిక్కుకోవడమే కాకుండా.. చుట్టూ ఉన్న వాళ్లని కూడా ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. అభి అల్లరి చేష్టలకు విసిగిపోయిన అతడి అన్న.. తనని దారిలో పెట్టేందుకు తెలిసిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగానికి వెళ్లమంటాడు. అక్కడే మధుమిత (దిగంగన)ను చూస్తాడు అభి. అయితే గతంలో అతడు చేసిన అల్లరి చేష్టల్ని ప్రత్యక్షంగా చూసిన మధు.. అతడిని ద్వేషించడం మొదలుపెడుతుంది. దీంతో ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతుంటారు. కానీ, వీరిద్దరూ అనుకోకుండా నాని - చిన్ని అనే మారు పేర్లతో ఓ డేటింగ్ యాప్ ద్వారా దగ్గరవుతారు. అసలైన ఫొటోలు, పేర్లు లేకపోవడంతో తామెవరితో ఛాటింగ్ చేస్తున్నదీ ఇద్దరికీ తెలియదు. సందేశాలతో మొదలైన వీరి స్నేహ ప్రయాణం.. క్రమంగా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ఓరోజు ప్రత్యక్షంగా కలవాలనుకుంటారు. ఆ సమయంలోనే నాని అలియాస్ అభిరామ్ తొందరపడి ఓ తప్పు చేస్తాడు. తను ఛాటింగ్ చేసే చిన్ని అనుకొని మరొక చిన్ని (మిర్నా మేనన్)కు ప్రపోజ్ చేస్తాడు. అదే సమయానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు అక్కడే ఉండటంతో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల నాని ఇంటికి చిన్ని వస్తుంది. తనకు దగ్గరై పెళ్లి సిద్ధమవుతుంది. అయితే ఆ తర్వాత ఏమైంది? తను ఛాట్ చేసిన చిన్ని.. తనతో పెళ్లికి సిద్ధమైన చిన్ని ఒకరు కాదని అతడికి ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత అతడికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరికి వీరి ప్రేమకథ సుఖాంతమైందా? లేదా? నాని ఆఖరికి ఎవరిని చేసుకున్నాడు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!