Shaitan: కానిస్టేబుల్ తలపై మేకుతో కొట్టి మరీ చంపేంత కక్ష!
‘ఆనందో బ్రహ్మా’, ‘యాత్ర’వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహి.వి.రాఘవ ఈసారి పూర్తి భిన్నమైన కథతో వెబ్‌సిరీస్ తెరకెక్కిస్తున్నారు
హైదరాబాద్: ‘ఆనందో బ్రహ్మా’, ‘యాత్ర’వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహి.వి.రాఘవ. ఇటీవల ‘సేవ్ ది టైగర్స్’కు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు పూర్తి భిన్నమైన కథతో వెబ్‌సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ‘సైతాన్’ (Saithan) పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ ఫస్ట్‌లుక్, కాన్సెప్ట్ టీజర్ విడుదలైంది. కానిస్టేబుల్ తలపై మేకుతో కొట్టి మరీ హత్య చేసి, నలుగురు అతడి శవం ముందే కూర్చొని ఉన్న కాన్సెప్ట్ పోస్టర్ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతోంది. రిషి, షెల్లీ, దేవియాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సామాజిక, రాజకీయ అంశాలతో ముడిపడిన కథతో ‘సైతాన్’ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కొన్ని పరిస్థితుల వల్ల బాలి అనే వ్యక్తి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? అలా ఇబ్బందులకు గురి చేసిన వారు ఏం చేశారు. తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ‘సైతాన్’ వెబ్ సిరీస్ జూన్ 15వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్