Custody: ‘కస్టడీ’లో కొత్త నాగ చైతన్యని చూస్తారు: వెంకట్‌ ప్రభు

నాగ చైతన్య (Naga Chaitanya) , కృతి శెట్టి (Krithi Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కస్టడీ’. మే 12న విడుదల కానున్న ఈ చిత్ర విశేషాలను దర్శకుడు వెంకట్‌ ప్రభు పంచుకున్నారు.

Published : 11 May 2023 19:11 IST

హైదరాబాద్‌: నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ రేపు (మే 12) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. కస్టడీకి సంబంధించిన కొత్త విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో ప్రేక్షకులంతా కొత్త నాగ చైతన్యను చూస్తారన్నారు. ‘కస్టడీ’ ఏ చిత్రానికీ రీమేక్‌ కాదని ఆయన స్పష్టం చేశారు.

‘‘ఒక మలయాళ సినిమా చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఆలోచనలు రాసుకున్నా. వాటితో ‘కస్టడీ’ కథ రాశాను. చైతన్య నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం. మేమిద్దరం కలిసి ఓ సినిమా చేయాలని గతంలోనే అనుకున్నాం. ‘కస్టడీ’ స్టోరీ లైన్‌ వినగానే నాగ చైతన్య ఓకే చెప్పాడు. ఈ సినిమా నేను ఇప్పటి వరకు తీసిన అన్నిటిలోకెల్లా భారీ బడ్జెట్‌ చిత్రం. 
నాగ చైతన్య చాలా సైలెంట్‌గా ఉంటాడు. వ్యక్తిగత విషయాల బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడడు. అంత పెద్ద స్టార్ అయినా చాలా నెమ్మదిగా ఉంటారు’’ అని చెప్పాడు. అలాగే ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు.

ఇక ఈ సినిమా నటీనటుల ఎంపిక విషయంలో సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. ‘‘కస్టడీ’ ద్విభాష చిత్రం కావడంతో నటీనటుల ఎంపిక కాస్త కష్టం అనిపించింది. అలాగే ప్రతి సన్నివేశాన్ని రెండు సార్లు చిత్రీకరించాం. చైతన్య, కృతి శెట్టి ఇద్దరూ తమిళంలో మాట్లాడగలరు. తెలుగు నటీనటులు తమిళంలో డైలాగులు చెప్పడానికి చైతన్య సాయం చేశారు.  ఇందులో చాలా యాక్షన్‌ సన్నివేశాలున్నాయి. ముఖ్యంగా నీళ్లల్లో సన్నివేశాలను చిత్రీకరించడం చాలా కష్టమైంది. ఇప్పటి వరకు రొమాంటిక్‌ సీన్స్‌లో నటించిన నాగ చైతన్య మొదటి సారి పూర్తి యాక్షన్‌ సినిమాలో నటించారు’’ అని వెంకట్‌ ప్రభు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని