DCompany: 4 నిమిషాల్లో సినిమా చూపించారు!

దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ప్ర‌ముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెర‌కెక్కించిన చిత్రం ‘డి - కంపెనీ’.

Published : 08 May 2021 01:18 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ప్ర‌ముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెర‌కెక్కించిన చిత్రం ‘డి - కంపెనీ’.  అష్వత్‌ కాంత్, ఇర్రా మోహన్, నైనా గంగూలి, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈనెల 15న స్పార్క్‌ ఓటీటీలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా సినిమాలోని 4 నిమిషాల స‌న్నివేశాన్ని సామాజిక  మాధ్య‌మాల వేదిక‌గా పంచుకున్నారు ఆర్జీవీ. ఇప్పుడు ముంబ‌యి చాలా ప్ర‌శాంతంగా ఉంది. కానీ అప్పుడు 40 సంవ‌త్స‌రాల క్రితం డీ కంపెనీ కంట్రోల్ ఉన్న‌ప్పుడు ఇలా ఉండేది కాదు అని ఆర్జీవీ చెప్పిన మాట‌లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముంబయిలోని ఓ చిన్న గ్యాంగ్‌ లీడర్‌.. పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడో ఈ చిత్రంలో చూపించ‌నున్నారు.  దావూద్ చ‌రిత్ర ఏంటో మీరూ చూసి తెలుసుకోండి...


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు