Daggubati: దగ్గుబాటి కుటుంబంలో విషాదం
ప్రముఖ నిర్మాత దివంగత రామానాయుడు సోదరుడు మోహన్‌బాబు మరణించారు. ఆయన మృతితో దగ్గుబాటి కుటుంబంలో విషాదం నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: దగ్గుబాటి (Daggubati) కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత దివంగత రామానాయుడు (RamaNaidu) తమ్ముడు రామమోహనరావు అలియాస్ మోహన్‌బాబు (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన స్వగ్రామం బాపట్ల జిల్లా కారంచేడులోని నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు. రామానాయుడు పెద్ద కుమారుడు, ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు (Suresh Babu) తన కుటుంబంతో కలిసి కారంచేడు చేరుకుని మోహన్‌బాబు భౌతికకాయానికి నివాళులర్పించారు.
సినిమా చిత్రీకరణ కోసం ముంబయిలో ఉండడంతో వెంకటేశ్ (Venkatesh) వెళ్లలేకపోయినట్టు తెలుస్తోంది. బుధవారం ఆయన తన బాబాయ్ పార్థివ దేహానికి నివాళి అర్పించనున్నారు. మోహన్‌బాబు మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మోహన్‌బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ‘ఒక చల్లని రాత్రి’ సినిమాని నిర్మించిన ఆయన మరో రెండు చిత్రాలను భాగస్వామ్యంతో రూపొందించారు. చీరాలలోని ఓ థియేటర్‌లో ఆయనకు భాగస్వామ్యం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ జాగీర్ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు