Dahini: జేడీ చక్రవర్తి ‘దహిణి’కి మరో అరుదైన పురస్కారం

జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ‘దహిణి’ చిత్రానికి మరో అవార్డు దక్కింది.

Published : 22 Nov 2022 01:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేడీ చక్రవర్తి (JD Chakravarthy), తనిష్ట ఛటర్జీ ప్రధాన పాత్రధారులుగా జాతీయ అవార్డు గ్రహీత రాజేశ్‌ టచ్‌రివర్‌ తెరకెక్కించిన సినిమా ‘దహిణి: ది విచ్‌’ (Dahini). తాజాగా ఈ చిత్రం.. ఆస్ట్రేలియాలో జరిగిన టైటాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డు దక్కించుకుంది. ఇప్పటికే పసిఫిక్‌ బీచ్‌ ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ వేడుకల్లో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా నిలిచింది. స్వీడిష్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా నామినేట్‌ అయ్యింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒడిశాలోని మయూర్‌ భంజ్‌ జిల్లాలో ఈ సినిమాని చిత్రీకరించారు. మంత్రవిద్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆషికీ హుస్సేన్‌, బద్రూల్‌ ఇస్లామ్‌, అంగనా రాయ్‌, జగన్నాథ్‌ సేతు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సామాజిక కార్యకర్త పద్మశ్రీ సునీత కృష్ణన్‌, ప్రదీప్‌ నారాయణన్‌ సంయుక్తంగా నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని