daksha nagarkar: వ్యక్తిగతంగా ఆయనంటే ఇష్టం
‘‘ప్రయోగం కంటే... వైవిధ్యం అనే మాటనే ఎక్కువగా నమ్ముతాను. అందుకు తగ్గట్టే నా ప్రయాణం సాగుతోంద’’ని చెబుతోంది దక్షా నగార్కర్.
‘‘ప్రయోగం కంటే... వైవిధ్యం అనే మాటనే ఎక్కువగా నమ్ముతాను. అందుకు తగ్గట్టే నా ప్రయాణం సాగుతోంద’’ని చెబుతోంది దక్షా నగార్కర్. ‘హోరా హోరి’తో తెలుగులోకి అడుగుపెట్టిన ఈమె... ‘హుషారు’, ‘జాంబీరెడ్డి’, ‘బంగార్రాజు’ తదితర చిత్రాలతో అలరించింది. ఇటీవల ఆమె రవితేజతో కలిసి ‘రావణాసుర’లో నటించింది. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దక్ష సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.
‘‘తొలి సినిమా చేస్తున్నప్పుడు నా వయసు పదిహేనేళ్లు. అప్పుడు ఏ రకమైన సినిమాలు చేయాలి, ఎలా ప్రయాణం చేయాలనే విషయంలో సరైన స్పష్టత ఉండేది కాదు. నా దగ్గరికి వచ్చిన కథల్లో నాకు నచ్చింది చేస్తూ ప్రయాణం చేశా. కానీ ఈ చిన్న ప్రయాణంలోనే వైవిధ్యమైన సినిమాలు చేశా. ‘రావణాసుర’ యాక్షన్‌తో కూడిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడే లుక్, కలర్, విజువల్ ఫ్లేవర్.. అన్నీ అర్థమయ్యాయి. దర్శకుడు సుధీర్‌వర్మ తీసిన సినిమాలంటే ఇష్టం. కథతోపాటు, కథానాయకుడు, ఇతర బృందం నచ్చి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా. నా పాత్ర ఏమిటి? నేనెంత సేపు కనిపిస్తాననే విషయాల గురించి ఇప్పుడేమీ చెప్పలేను. కానీ థియేటర్లో మాత్రం నా పాత్ర ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది’’.
* ‘‘సినిమాలో నా పాత్ర ఏమిటి? దాన్నెంత బాగా చేశామనే విషయంపైనే దృష్టి పెడతాను తప్ప... మిగతా విషయాల గురించి ఆలోచించను. ఇందులో ఎంతమంది కథానాయికలు ఉన్నా ప్రతి పాత్రకీ తగు ప్రాధాన్యం ఉంటుంది. నా పాత్రకి నేనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నా. కథానాయకుడు రవితేజతో కలిసి ప్రయాణం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన సెట్లో అందరితో సరదాగా ఉంటారు. నటించేటప్పుడు కూడా మెథడ్ యాక్టింగ్ అని కాకుండా... అప్పటికప్పుడు ఆ పాత్రకి తగ్గట్టుగా మారిపోతుంటారు. మరో కథానాయకుడు సుశాంత్‌తోనూ కలిసి ప్రయాణం చేయడం చాలా సరదాగా అనిపించింది’’.
* ‘‘చిత్రసీమలో ప్రతి రోజూ నేర్చుకోవల్సిందే. చిన్న వయసులోనే కెరీర్ మొదలుపెట్టా. ప్రతి సినిమాతోనూ కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా. ఇటీవలే విదేశాల్లో యాక్టింగ్‌కోర్స్ కూడా చేశా. సినిమాలు చేస్తూనే సమయం దొరికినప్పుడంతా నాలోని నైపుణ్యాల్ని మెరుగు పరుచుకోవడంపై దృష్టిపెట్టా. అది నా కెరీర్‌పై మంచి ప్రభావం చూపించింది. ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అన్ని రకాల కథలే కాదు, అందరు హీరోలతోనూ కలిసి నటించాలని ఉంది. మాధురి దీక్షిత్, అలియాభట్ అంటే ఇష్టం. వాళ్ల ప్రభావం నాపై చాలా ఉంటుంది. తెలుగులో ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఆయనకి భాషపై పట్టు, ఆయన సంభాషణలు చెప్పే విధానం నాకు బాగా నచ్చుతుంది. వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానిస్తా’’.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Sharad Pawar: శరద్ పవార్‌కు బెదిరింపులు.. పంపింది భాజపా కార్యకర్త..?
-
Sports News
WTC Final: భారత జట్టా.. ఫ్రాంచైజీ క్రికెట్టా..?ఐపీఎల్ కాంట్రాక్ట్‌లో కొత్త క్లాజ్ చేర్చాలన్న రవిశాస్త్రి
-
Politics News
Badvel: టికెట్ కోసం జగన్‌ను ఐదుసార్లు కలిసినా ప్రయోజనం లేదు: ఎమ్మెల్యే మేకపాటి
-
Movies News
Chiranjeevi: వరుణ్ - లావణ్య.. అద్భుతమైన జోడీ: చిరంజీవి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nara Lokesh: వైకాపా ఇసుక మాఫియాకు ఇదే ప్రత్యక్షసాక్ష్యం: నారా లోకేశ్ సెల్ఫీ