Ravanasura: రవితేజకు విలన్‌గా?

రవితేజ కథానాయకుడిగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పూజా   కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది.

Published : 06 Jan 2022 14:59 IST

రవితేజ కథానాయకుడిగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. అభిషేక్‌ నామా నిర్మిస్తున్నారు.  ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా.. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న పూజా   కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర తారాగణాన్ని ఖరారు చేసే పనిలో పడింది చిత్ర బృందం. ఇందులో రవితేజ కోసం ఓ శక్తిమంతమైన లేడీ విలన్‌ పాత్రని తీర్చిదిద్దినట్లు తెలిసింది. ఇప్పుడా పాత్ర కోసం దక్షా నగార్కర్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. తన పాత్ర నచ్చడంతో సినిమా చేసేందుకు   దక్షా ఒకే చెప్పిందని ప్రచారం వినిపిస్తోంది. ‘హుషారు’, ‘జాంబిరెడ్డి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ముంబయి సోయగం ఆమె. ప్రస్తుతం ప్రతి నాయికగా అలరించేందుకు సిద్ధమవడం ఆసక్తిరేకెత్తిస్తోంది. ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా సందడి చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని