‘రాబర్ట్‌’ టీజర్‌ చూసేయండీ!

ఈ మధ్యకాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో భాషల అంతరాలు తొలిగిపోయాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు ఒకేసారి రెండు, మూడు భాషల్లో తెరకెక్కుతున్నాయి. అదే క్రమంలో కన్నడలో స్టార్‌ హీరో అయిన దర్శన్‌ కూడా తెలుగు ప్రేక్షకులను

Published : 04 Feb 2021 18:16 IST


హైదరాబాద్‌: ఈ మధ్యకాలంలో భారతీయ చిత్ర పరిశ్రమలో భాషల అంతరాలు తొలిగిపోయాయి. ముఖ్యంగా దక్షిణాది సినిమాలు ఒకేసారి రెండు, మూడు భాషల్లో తెరకెక్కుతున్నాయి. అదే క్రమంలో కన్నడలో స్టార్‌ హీరో దర్శన్‌ కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాబర్ట్‌’ సినిమా తెలుగు టీజర్‌ను విడుదల చేశారు. శాండల్‌వుడ్‌లో అభిమానులు ముద్దుగా ‘Dబాస్‌’ అని పిలుచుకునే దర్శన్‌ తెలుగులో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘తను ఓర్పులో శ్రీరాముడు, మాటిచ్చాడంటే దశరథరాముడు, ప్రేమతో వస్తే జానకి రాముడు, తిరగబడితే..’ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తున్న వాయిస్‌తో సినిమా టోన్‌ ఏంటో అర్థమౌతోంది. ఈ చిత్రం మార్చి 11న విడుదల కానుంది. తన స్టైల్లో గ్రాండ్‌ ఎంట్రీతో వస్తున్న దర్శన్‌ ‘రాబర్ట్‌’ టీజర్‌ను మీరు చూసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని