Published : 10 Oct 2021 01:28 IST

Dasara Bullollu Latest Promo: దసరా బుల్లోళ్ళు వచ్చేశారు.. ఇక రచ్చరచ్చే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దసరా కానుకగా ప్రేక్షకులకు భారీ వినోదాన్ని పంచేందుకు వేదికైంది ‘‘దసరా బుల్లోళ్లు’’ షో. ఈ అక్టోబరు15న (వచ్చే శుక్రవారం) రాబోయే కార్యక్రమానికి సంబంధించి ప్రొమో శనివారం విడుదలైంది. చాలా రోజుల తరవాత శేఖర్‌ మాస్టర్‌ రీఎంట్రీతో ఒక్కసారిగా సందడి వాతావరణం వచ్చేసింది. ఇక శేఖర్‌ మాస్టర్‌ సదాను చూస్తూ.. ‘‘రానురానంటూనే చిన్నదో ’’ పాట పాడుతుంటే మరో పక్కనే ఉన్న రోజా ‘‘రానురానుంటే శేఖరో..శేఖరో.. ఈవెంట్‌ కొచ్చాడో శేఖరో శేఖరో’’ అని ఆటపట్టించిన తీరు నవ్వులు పూయించింది. మరో పక్క షోలో పెళ్లిసందD ప్రమోషన్స్‌లో భాగంగా విచ్చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు, హీరోహీరోయిన్లు రోషన్‌, శ్రీలీలకు స్వాగతం లభించింది.

‘‘రోషన్‌.. నీకో సర్‌ప్రైజ్ ఫొటో చూపిస్తా’’ అని చిన్నప్పుడు రోషన్‌తో దిగిన ఫొటోను రోజా  చూపించగానే.. ‘‘రోజా! ఇచ్చావ్‌ పెద్ద కాజా!’’ అన్నారు దర్శకేంద్రుడు. సదాతో  ‘జయం’ గురించి ప్రస్తావించారు. ఇక షోలో కార్తీకదీపం వంటలక్క కామెడీ ట్రాక్‌, ఆటోరామ్‌ ప్రసాద్‌, హైపర్‌ ఆది పంచులు ఎప్పటిలాగే నవ్వుల్లో ముంచెత్తాయి. చివరాఖరులో గెటప్‌ శ్రీను పల్లెసీమలను, ప్రకృతిని ఉద్దేశించి చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్స్‌ ప్రతి ఒక్కరిని కదలించేలా ఉన్నాయి. ఇంకెందుకాలస్యం ఈ వినోదాల సందడిని మీరు వీక్షించేయండి.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని