Dasara: ‘దసరా’ సెన్సార్‌ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్‌ అంటే?

నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల రూపొందించిన ‘దసరా’కు సెన్సార్‌ పూర్తయింది. మార్చి 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Published : 25 Mar 2023 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నాని (Nani) అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా’ (Dasara) త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. యూఏ (UA) సర్టిఫికెట్‌ జారీ చేసిన సెన్సార్‌ బోర్డు (Central Board of Film Certification) సబ్‌టైటిల్స్‌సహా అసభ్యకరమైన సంభాషణలకు ‘మ్యూట్‌’ పెట్టాలని, డిస్‌క్లైమర్‌ (ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం) ఫాంట్‌ పెంచమని, వైలెన్స్‌ అధికంగా ఉన్న సన్నివేశాలను సీజీ (CG)తో కవర్‌ చేయాలని చిత్ర బృందానికి సూచించింది. మొత్తంగా 16 కట్స్‌ చెప్పింది. ఈ సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాలు.

నాని ఊరమాస్‌ పాత్రలో నటించడం, తనకు తొలి పాన్‌ ఇండియా చిత్రంకావడంతో ‘దసరా’పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ అంచనాలు పెంచాయి. సింగరేణి సమీపాన ఉండే వీర్లపల్లి గ్రామం నేపథ్యంలో నూతన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల ఈ సినిమాని తెరకెక్కించారు. కీర్తి సురేశ్‌ కథానాయిక. మార్చి 30న రిలీజ్‌కానున్న ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయినట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని