Dasara: ‘బాహుబలి’.. ‘ఆర్‌ఆర్ఆర్’.. ఇప్పుడు ‘దసరా’!
Dasara: నాని కథానాయకుడిగా నటించిన ‘దసరా’ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది.
హైదరాబాద్: నాని (Nani) కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘దసరా’ (Dasara). కీర్తిసురేశ్ (keerthy suresh) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా నేపథ్యం, నాని లుక్, ప్రచార చిత్రాలు ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. ఈ క్రమంలో చిత్ర బృందం ఈ సినిమాను భారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్‌లలో ‘దసరా’ విడుదల కానుంది.
తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3వేలకు పైగా థియేటర్స్‌లో భారీగా విడుదలవుతోంది. ఇప్పటివరకూ అతి తక్కువ చిత్రాలు మాత్రమే 3వేలు అంతకన్నా ఎక్కువ థియేటర్స్‌లో విడుదలయ్యాయి. ‘బాహుబలి- 1, 2’, సాహో, సైరా, పుష్ప, రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్, లైగర్ ఇప్పటివరకూ అత్యధిక థియేటర్స్‌లో విడుదలైన తెలుగు చిత్రాలుగా రికార్డు సృష్టించగా, ఈ జాబితాలో నాని మూవీ కూడా చేరింది.
ఇప్పటివరకూ చూడని సరికొత్త లుక్‌లో నాని కనిపిస్తున్నారు. కథకు ఉన్న డిమాండ్ బట్టి చిత్ర నిర్మాణ సంస్థ భారీగానే ఖర్చు చేసినట్లు సమాచారం. క్లైమాక్స్ కోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టారట. పతాక సన్నివేశాలు ఎమోషన్స్‌తో పాటు, మాస్‌ను మెప్పించే ఫైట్స్‌తో సాగుతుందని తెలుస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Deemed University Status: డీమ్డ్ యూనివర్సిటీ హోదాకు కొత్త నిబంధనలు
-
Ts-top-news News
Delhi Liquor Policy Case: ఈడీ అధికారులు బెదిరించడం వల్లే కవిత పేరు చెప్పారు
-
General News
Odisha Train Accident : అక్కడి వాతావరణం భీతావహం.. ‘ఈనాడు’తో ఏపీ ప్రయాణికులు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
Train Accidents: దశాబ్దకాలంలో జరిగిన పెను రైలు ప్రమాదాలివీ..
-
Ap-top-news News
AP IIIT Admissions 2023: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు వేళాయె