Dasara: ధరణి.. వెన్నెల గుర్తుండిపోతారు
‘‘దసరా’ (Dasara) మాకు చాలా ఎమోషనల్ సినిమా. ఈ చిత్రంతో రివార్డులు, అవార్డులు మొదలవుతాయి.
‘‘దసరా’ (Dasara) మాకు చాలా ఎమోషనల్ సినిమా. ఈ చిత్రంతో రివార్డులు, అవార్డులు మొదలవుతాయి. ఇలాంటి మరెన్నో సినిమాలు చేయడానికి ఇది ఆరంభమవుతుందని భావిస్తున్నా’’ అన్నారు నాని (Nani). ఆయన, కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈనెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం థియేటర్స్‌లో పూనకాలు తెప్పిస్తుంది. మార్చి 30 తర్వాత నాని, కీర్తి సురేష్ పేర్లు మాయమైపోయి ధరణి, వెన్నెల మాత్రమే గుర్తుంటారు. శ్రీకాంత్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు’’ అన్నారు. ‘‘ఇందులో నేను చేసిన వెన్నెల పాత్ర నాకెంతో ప్రత్యేకం. ఇది ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. ఇక థియేటర్లలో కుమ్మేద్దాం అంతే’’ అంది నాయిక కీర్తి సురేష్. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ ఓదెల, దీక్షిత్ శెట్టి, ఝాన్సీ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: రంగంలోకి పెన్స్.. ట్రంప్‌తో పోటీకి సై..!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. తండ్రీకుమారుడికి బెయిల్ మంజూరు
-
Movies News
varun tej: మెగా ఇంట పెళ్లి సందడి.. వరుణ్ తేజ్ నిశ్చితార్థంపై ప్రకటన!
-
Politics News
Opposition Meet: ‘450 స్థానాల్లో భాజపాపై ఒక్కరే పోటీ’.. విపక్షాల వ్యూహం ఇదేనా..?
-
Movies News
Yash: మరో రామాయణం సిద్ధం.. రాముడిగా రణ్‌బీర్, రావణుడిగా యశ్..!
-
Sports News
WTC Final: తొలి క్రికెటర్‌గా ట్రావిస్ హెడ్ ఘనత.. మొదటి రోజు ఆటలో రికార్డుల జోరు!