Kalyan Ram: ఆ రోజే ‘అమిగోస్‌’

‘బింబిసార’ లాంటి విజయం తర్వాత కల్యాణ్‌ రామ్‌ నుంచి వస్తున్న చిత్రం ‘అమిగోస్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Updated : 06 Jan 2023 07:21 IST

‘బింబిసార’ లాంటి విజయం తర్వాత కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) నుంచి వస్తున్న చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆషికా రంగనాథ్‌ కథానాయిక. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ నెల 8న ఉదయం 11:07గంటలకు టీజర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కల్యాణ్‌రామ్‌ మూడో పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఆయన మూడు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఓ పాత్రలో సిద్ధార్థ్‌ అనే వ్యాపారవేత్తగా, మరో పాత్రలో మంజునాథ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కనిపించగా.. ఈ మూడో పాత్రలో గుబురు గడ్డం, పొడవాటి జుత్తుతో చేతిలో గన్‌ పట్టుకొని ఆసక్తికరంగా కనిపించారు. ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథతో రూపొందుతోన్న చిత్రమిది. వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని