Dear Nanna: నేరుగా ఓటీటీలోకి ‘డియర్‌ నాన్న’.. ఎమోషనల్‌గా ట్రైలర్‌

చైతన్యరావు, సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్‌ నాన్న’. ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.

Updated : 15 Jun 2024 09:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫాదర్ అండ్‌ సన్‌ సెంటిమెంట్‌తో రూపొందిన ఎన్నో చిత్రాలు తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. అదే నేపథ్యంతో రూపొందిన ‘డియర్‌ నాన్న’ (Dear Nanna) విడుదలకు సిద్ధమైంది. చైతన్యరావు (Chaitanya Rao), సూర్య (Surya) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అంజి సలాది దర్శకత్వం వహించారు. నేరుగా ఈ సినిమా ఓటీటీ ‘ఆహా’ (Aha)లో ఈనెల 14న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. మెడికల్‌ షాపుల గొప్పదనాన్ని తెలియజేసేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. తండ్రి పాత్రలో సూర్య, కుమారుడిగా చైతన్యరావు ఆకట్టుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని