Deepika Padukone: ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ ‘ ప్రాజెక్ట్‌-కె’ షురూ.. సెట్స్‌లోకి దీపిక

బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘ప్రాజెక్ట్‌- కె’లో (వర్కింగ్‌ టైటిల్‌) ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపికాకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు.

Updated : 04 Dec 2021 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారు. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘ప్రాజెక్ట్‌- కె’లో (వర్కింగ్‌ టైటిల్‌) ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపికాకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. నగరానికి చేరుకున్న దీపికా లిలాక్‌పాంట్‌ సూట్‌, వైట్‌ క్రాప్‌ టాప్‌లో దర్శనమిచ్చారు. హిందీ పరిశ్రమలో తనదైన సత్తా చాటిన దీపికకు తెలుగులో ఇదే తొలి చిత్రం. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. బిగ్‌ బి అమితాబ్‌ ఇందులో కీకల పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది జులైలో గురు పూర్ణిమ సందర్భంగా అమితాబ్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ‘మహానటి’కి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డాని శాంచెజ్-లోపెజ్.. ఈ చిత్రానికి పనిచేస్తుండగా.. మిక్కీ జే మేయర్‌ స్వరాలు అందిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని