Prabhas: దీపిక పదుకొణె కోసం ప్రభాస్‌ భారీ లంచ్‌.. ఎన్ని ఐటమ్స్‌ పెట్టారంటే?

భారీ ప్రాజెక్టులతో వరుస సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు ప్రభాస్(Prabhas). నాగ్‌ అశ్విన్‌

Published : 14 Dec 2021 01:47 IST

హైదరాబాద్‌: భారీ ప్రాజెక్టులతో వరుస సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు ప్రభాస్(Prabhas). నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’(Project K). దీపిక పదుకొణె(Deepika Padukone)కథానాయిక. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్‌, దీపికా పదుకొణెలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్టు కె’ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. కథ రీత్యా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించేలా ప్రఖ్యాత రామోజీఫిల్మ్‌ సిటీలో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరిపారు. దీంతో దీపిక పదుకొణెకు సంబంధించి ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తవడంతో ఆమె తిరిగి ముంబయి వెళ్లిపోయారు.

ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయిన అనంతరం దీపిక కోసం ప్రభాస్‌ భారీ లంచ్‌ను ఏర్పాటు చేశారట. ఆ ఐటమ్స్‌ను చూసి, దీపిక ఆశ్చర్యపోయారట. ఇందుకు సంబంధించిన ఫొటోలను దీపిక ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ‘ప్రాజెక్ట్‌ కె’లో నా ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయింది. లవ్లీ హైదరాబాద్‌. మళ్లీ కలుద్దాం’ అంటూ ఫొటోలను షేర్‌ చేసింది. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ తెరకెక్కిస్తోంది. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రభాస్‌ ఆహార ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిందే. తాను ఏ సినిమా షూటింగ్‌లో ఉంటే అందులో నటించే నటీనటుల కోసం ప్రత్యేకంగా వంటలు సిద్ధం చేయిస్తారు. ‘బాహుబలి’, ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ షూటింగ్‌ల సందర్భంగానూ ప్రభాస్‌ భారీ లంచ్‌లు ఏర్పాటు చేసి, నటీనటులను సర్‌ప్రైజ్‌ చేశారు. ‘రాధేశ్యామ్‌’లో నటిస్తున్న బాలీవుడ్‌ తార భాగ్యశ్రీ సైతం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు