Deepika padukone: ఆమె.. ప్రతీ 3 నిమిషాలకు ఒకసారి తింటుంది

దీపిక గురించి అమితాబ్‌ చెప్పిన సీక్రెట్స్‌ ఇవే.. అవును ఆమె ఎక్కువగా తింటుంది

Published : 10 Sep 2021 01:52 IST

‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ షోలో అమితాబ్‌ బచ్చన్‌

ముంబయి: బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె గురించి అభిమానులకు ఓ సీక్రెట్‌ చెప్పుకొచ్చారు బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌. ‘‘సాధారణంగా ఎవరైనా.. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌.. ఇలా రోజు మొత్తంలో మూడు సార్లు తింటారు. కానీ దీపికాపదుకొణె మాత్రం అలా కాదన్నారు అమితాబ్‌. ‘‘అవును ఇది నిజం! నేను చూసినంత వరకు దీపిక.. ప్రతీ మూడు నిమిషాలకొకసారి ఏదో ఒకటి తింటూనే ఉంటుంది’’ అన్నారు. తాజాగా ‘‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’’ కార్యక్రమంలో కంటెస్టెంట్స్‌గా వెళ్లారు నటి దీపిక, దర్శకురాలు, కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌. కాగా ప్రశ్నలు అడిగే క్రమంలో వీరి మధ్య ఈ సరదా సంభాషణ జరిగింది. ‘‘నేను దీపిక కలిసి పీకూ సినిమాలో నటించినప్పుడు.. ప్రతీ మూడు నిమిషాలకు తింటూ కనిపించేది.. అయితే నాకు ఎప్పుడు పెట్టేది కాదు’’ అంటూ సరదాగా చెప్పగా.. దీపిక నవ్వుతూ ఇదంతా నిజం కాదన్నారు. అసలువిషయమేటింటే.. ‘‘నా డబ్బా తెరిచేసరికి.. అమితాబ్‌ జీ! పదేపదే ఏమితింటున్నావ్‌ అని అడిగేవారు’’ అనగానే వెంటనే బిగ్‌బి నవ్వుతూ ఈ షోలో అబద్ధాలు చెప్పకూడదంటూ సరదాగా బదులిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని