
Published : 20 Jan 2022 18:42 IST
‘గెహ్రాహియా’ ట్రైలర్: హాట్‌హాట్ సన్నివేశాల్లో దీపిక-సిద్ధాంత్
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటులు దీపికా పదుకొణె- సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే- ధైర్యా కర్వా కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ చిత్రం ‘గెహ్రాహియా’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘గెహ్రాహియా’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రేమ, స్నేహం, వ్యక్తిగత సంబంధాల వాటి పరిణామాల చుట్టూ కథను తీర్చిదిద్దాడు దర్శకుడు షకున్ బత్రా. అలిషా, జైన్ అనే జంట ప్రయాణమే ‘గెహ్రాహియా’ కథ. దీపిక-సిద్ధాంత్ ప్రణయ సన్నివేశాలతో సినిమాను హాట్‌హాట్‌గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నసీరుద్దీన్ షా, రాజాత్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. సుమిత్ రాయ్ కథ అందించగా.. కరణ్ జోహర్ ప్రొడక్షన్ హౌస్ ధర్మా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మిస్తోంది.
Tags :