దీపిక చిత్రం తిరిగి సెట్స్‌పైకి

‘కపూర్‌ అండ్‌ సన్స్‌’తో భారీ విజయం అందుకున్న షకున్‌ బత్రా దర్శకత్వంలో ఓ చిత్రం ఈ ఏడాది మార్చిలో మొదలైంది. ఇందులో దీపికా పదుకొణె,

Published : 27 Aug 2020 10:26 IST

ముంబయి: ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’తో భారీ విజయం అందుకున్న షకున్‌ బత్రా దర్శకత్వంలో ఓ చిత్రం ఈ ఏడాది మార్చిలో మొదలైంది. ఇందులో దీపికా పదుకొణె, అనన్యాపాండే, సిద్ధాంత్‌ చతుర్వేది ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ మొదలైన కొన్ని రోజులకే కొవిడ్‌ ప్రభావంతో సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా ఆగి పోయింది.

తాజాగా కేంద్రం చిత్రీకరణలకు అనుమతులు ఇవ్వడంతో తమ సినిమాను వచ్చే నెల్లో తిరిగి సెట్స్‌ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది చిత్రబృందం. ఈ చిత్రంలోని కొంత భాగాన్ని    శ్రీలంకలో తెరకెక్కించాలనుకున్నారు. కానీ విదేశాలకు వెళ్లి షూటింగ్‌ చేయడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల్లోనే గోవాలో 25 రోజుల పాటు షూటింగ్‌ చేయనున్నారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని