Deepika Padukone: దీపికా పదుకొణె ‘82°E’ టాటూ వెనుక ఆసక్తికరమైన అర్థమిదే..

తాజాగా ఆస్కార్‌ వేడుకల సందర్భంగా దీపికా పదుకొణె (Deepika Padukone) పోస్ట్‌ చేసిన ఫొటోలు వైరలయ్యాయి. అందులో ఆమె మెడపై ఉన్న టాటూకు అర్థం కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

Updated : 15 Mar 2023 11:52 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె (Deepika Padukone) ఇటీవల జరిగిన ఆస్కార్‌ (Oscars)వేడుకల్లో సందడి చేసింది. వేదికపై ఎంతో హుందాగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందింది. అయితే ఆస్కార్‌లో దీపిక ధరించిన డ్రెస్‌తో పాటు ఆమె మెడపై ఉన్న టాటూ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నలుపు రంగు గౌనులో.. మెడలో నెక్‌పీస్‌తో అందరినీ ఆకట్టుకున్న దీపిక..  తన మెడపై ‘82°E’  అని ఉన్న టాటూ కనిపించేలా ఫొటోలను షేర్‌ చేసింది. అప్పటి నుంచి ఆ టాటూకు అర్థం ఏంటని నెటిజన్లు ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు.

‘82 డిగ్రీస్‌ ఈస్ట్‌’ అని దీని అర్థం.  ఇది ఆమె కొత్తగా మొదలుపెట్టిన స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ పేరు. ఈ పేరుతో గత కొన్ని నెలలుగా చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. దీపిక తన సొంత బ్రాండ్‌ పేరును టాటూగా వేయించుకుంది. ఇది చూసిన ఫ్యాన్స్‌ ‘కమిట్‌మెంట్‌ అంటే దీపికదే’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక ఇటీవల జరిగిన ఆస్కార్‌ వేడుకలో దీపిక తన స్పీచ్‌తో అందరి మనసులను గెలుచుకున్న విషయం తెలిసిందే. తొలి రౌండ్‌ ప్రజెంటర్లలో ఒకరిగా తన స్పీచ్‌ను కొనసాగించింది. వేడుకకు వచ్చిన ప్రముఖులకు ‘నాటు నాటు’(Naatu Naatu) పాటను పరిచయం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని