కీలకపదవికి దీపిక రాజీనామా

ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికాపదుకొణె ‘మామి’ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేశారు. వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండడం చేత తాను వేరే బాధ్యతలపై దృష్టి సారించడానికి సమయం సరిపోవడం లేదని దీపిక తెలిపారు....

Updated : 12 Apr 2021 13:25 IST

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికాపదుకొణె ‘మామి’ (ముంబయి అకాడమీ ఆఫ్‌ మూవింగ్‌ ఇమేజ్‌) చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేశారు. వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండడంతో తాను వేరే బాధ్యతలపై దృష్టి సారించడానికి సమయం సరిపోవడం లేదని ఆమె తెలిపారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘మామి’ బోర్డులో సభ్యురాలిగా ఉన్నందుకు, చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించినందుకు ఎంతో గర్విస్తున్నా. ఒక నటిగా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది టాలెంట్‌ని గుర్తించి ముంబయికి తీసుకురావడం ఆనందాన్ని ఇచ్చింది. అయితే, ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో నేను బిజీగా ఉన్నాను. దానివల్ల ‘మామి’కి పూర్తిస్థాయిలో సేవలు అందించలేకపోతున్నా. దాంతో నేను పదవీ బాధ్యతల నుంచి వైదొలగుతున్నా. ‘మామి’తో నాకున్న అనుబంధం విడదీయరానిది’ అని దీపిక పేర్కొన్నారు.

ఆమిర్‌ఖాన్‌ సతీమణి కిరణ్‌రావు పదవీ కాలం పూర్తైన తర్వాత 2019లో దీపికా ‘మామి’ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె షారుఖ్‌ నటిస్తున్న ‘పఠాన్‌’ చిత్ర షూట్‌లో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా హృతిక్‌ కథానాయకుడిగా రానున్న ‘ఫైటర్‌’తోపాటు నాగ్‌అశ్విన్‌-ప్రభాస్‌ ప్రాజెక్ట్‌లోనూ దీపికా కథానాయికగా కనిపించనున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు