Deepika Padukone: బేషరమ్ రంగ్.. మీకు కనిపించేది నిజం కాదు: దీపికా పదుకొణె
‘పఠాన్’ (Pathaan) ప్రమోషన్స్‌లో భాగంగా ‘బేషరమ్ రంగ్’ పాట గురించి స్పందించారు నటి దీపికా పదుకొణె (Deepika Padukone). ఆ పాట షూటింగ్ కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు.
ఇంటర్నెట్‌డెస్క్: షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) - దీపికా పదుకొణె (Deepika Padukone) ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. జనవరి 25న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి వస్తోన్న పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ దీపిక ఓ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇందులో భాగంగా ఆమె.. వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న ‘బేషరమ్ రంగ్’ పాటపై స్పందించింది. ఆ పాటలో మనం చూస్తోన్న దానికి లొకేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరించింది.
షారుఖ్‌తో మీ అనుబంధం ఎలాంటిది?
దీపిక: ఆయనపై నాకున్న అభిమానాన్ని మాటల్లో వర్ణించలేను. ఆయనతో నాది ఎన్నో ఏళ్ల నాటి అనుబంధం. ‘ఓం శాంతి ఓం’ నుంచి ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో కలిసి నటించే అవకాశం మా ఇద్దరికీ దక్కడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నా. ఒక ప్రేక్షకురాలిగా ఆయన్ని స్పై, యాక్షన్ థ్రిల్లర్‌లో చూడటానికి నేను ఇష్టపడతాను. ఇప్పుడు, అలాంటి కథలోనే ఆయనతో నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది.
సిద్ధార్థ్ ఆనంద్ గురించి మాట్లాడగలరు?
దీపిక: సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నా రెండో చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శతక్వం వహించారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ‘పఠాన్’ కోసం ఆయనతో కలిసి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే మా ఇద్దరి కాంబోలో మరో సినిమా రానుంది. ‘ఫైటర్’ అనే టైటిల్ ఖరారు చేశాం. జీవితంలో ఏం సాధించాలనే విషయంలో అతనికి ఓ క్లారిటీ ఉంది.
‘పఠాన్’ కోసం డైట్ చేశారా?
దీపిక: అవును చేశాను. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన డైట్ ఫాలో అయ్యాను. ఒక పాత్రకు సంబంధించిన శరీరాకృతి కోసం నేను ఇంతలా ఎప్పుడూ కష్టపడలేదు. క్లిష్టమైన వర్కౌట్లు, డైట్స్ చేశాను. అలాగే, ఏడాదిన్నరపాటు ఒకే రకమైన శరీరాకృతిని కలిగి ఉండటం కోసం తీవ్రంగా శ్రమించా. అయితే డైట్ వివరాలను వెల్లడించను.
‘పఠాన్’లోని ఏ పాట మీకు బాగా నచ్చింది..?
దీపిక: ఇందులోని రెండు పాటలూ నాకెంతో నచ్చాయి. రెండూ విభిన్నమైన పాటలు కాబట్టి ఒక్కదాన్ని ఎంచుకోవడం కాస్త కష్టమే. ముఖ్యంగా ‘బేషరమ్ రంగ్’ కోసం ఎంతో శ్రమించాను. ఆ పాటను చూస్తే.. అదేదో వేసవి కాలంలో మంచి వెలుతురులో షూట్ చేసినట్లు ఉంటుంది. కానీ, నిజానికి ఆ పాట షూట్ అప్పుడు ఆ ప్రాంతం మొత్తం చలిగాలితో నిండిపోయి ఉంది. అలాంటి లొకేషన్స్‌లో షూట్ చేయడం ఇబ్బందిగా అనిపించింది.
‘పఠాన్’ షూటింగ్ గురించి మాట్లాడిన దీపిక..
‘‘నాకు సినిమా ఎన్నో అనుభవాలను ఇచ్చింది. అందుకే నాకు సినిమాలు ఎంతో ప్రత్యేకమైనది. నేను ఎక్కువ సమయాన్ని నటించడానికి కేటాయిస్తున్నాను. ‘పఠాన్’ సినిమా షూటింగ్ సమయంలో మనమంతా గొప్ప సమయాన్ని గడిపామని నేను భావిస్తున్నాను. మేము ఎంతలా ఎంజాయ్ చేశామో సినిమాలో కనిపిస్తుంది. పాటల్లో కచ్చితంగా మీరు చూస్తారు. మంచి వ్యక్తులతో సమయాన్ని గడపమని షారుక్ నాకు సలహా ఇచ్చారు. నేను అదే చేశాను’’ అని దీపిక చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్‌బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా