Deepika Padukone: బేషరమ్‌ రంగ్‌.. మీకు కనిపించేది నిజం కాదు: దీపికా పదుకొణె

‘పఠాన్‌’ (Pathaan) ప్రమోషన్స్‌లో భాగంగా ‘బేషరమ్‌ రంగ్‌’ పాట గురించి స్పందించారు నటి దీపికా పదుకొణె (Deepika Padukone). ఆ పాట షూటింగ్‌ కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పారు.

Published : 23 Jan 2023 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్: షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) - దీపికా పదుకొణె (Deepika Padukone) ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పఠాన్‌’ (Pathaan). సిద్ధార్థ్‌ ఆనంద్‌‌ దర్శకుడు. జనవరి 25న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి వస్తోన్న పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ దీపిక ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది. ఇందులో భాగంగా ఆమె.. వివాదాలకు కేంద్రబిందువుగా ఉన్న ‘బేషరమ్‌ రంగ్‌’ పాటపై స్పందించింది. ఆ పాటలో మనం చూస్తోన్న దానికి లొకేషన్‌కు ఎలాంటి సంబంధం లేదని వివరించింది.

షారుఖ్‌తో మీ అనుబంధం ఎలాంటిది?

దీపిక: ఆయనపై నాకున్న అభిమానాన్ని మాటల్లో వర్ణించలేను. ఆయనతో నాది ఎన్నో ఏళ్ల నాటి అనుబంధం. ‘ఓం శాంతి ఓం’ నుంచి ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో కలిసి నటించే అవకాశం మా ఇద్దరికీ దక్కడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నా. ఒక ప్రేక్షకురాలిగా ఆయన్ని స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌లో  చూడటానికి నేను ఇష్టపడతాను. ఇప్పుడు, అలాంటి కథలోనే ఆయనతో నేను స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది.

సిద్ధార్థ్‌ ఆనంద్‌‌ గురించి మాట్లాడగలరు? 

దీపిక: సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో నా రెండో చిత్రానికి సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శతక్వం వహించారు. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ‘పఠాన్‌’ కోసం ఆయనతో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా ఉంది. త్వరలోనే మా ఇద్దరి కాంబోలో మరో సినిమా రానుంది. ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశాం. జీవితంలో ఏం సాధించాలనే విషయంలో అతనికి ఓ క్లారిటీ ఉంది.

‘పఠాన్‌’ కోసం డైట్‌ చేశారా?

దీపిక: అవును చేశాను. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన డైట్‌ ఫాలో అయ్యాను. ఒక పాత్రకు సంబంధించిన శరీరాకృతి కోసం నేను ఇంతలా ఎప్పుడూ కష్టపడలేదు. క్లిష్టమైన వర్కౌట్లు, డైట్స్‌ చేశాను. అలాగే, ఏడాదిన్నరపాటు ఒకే రకమైన శరీరాకృతిని కలిగి ఉండటం కోసం తీవ్రంగా శ్రమించా. అయితే డైట్‌ వివరాలను వెల్లడించను. 

‘పఠాన్‌’లోని ఏ పాట మీకు బాగా నచ్చింది..?

దీపిక: ఇందులోని రెండు పాటలూ నాకెంతో నచ్చాయి. రెండూ విభిన్నమైన పాటలు కాబట్టి ఒక్కదాన్ని ఎంచుకోవడం కాస్త కష్టమే. ముఖ్యంగా ‘బేషరమ్‌ రంగ్‌’ కోసం ఎంతో శ్రమించాను. ఆ పాటను చూస్తే.. అదేదో వేసవి కాలంలో మంచి వెలుతురులో షూట్‌ చేసినట్లు ఉంటుంది. కానీ, నిజానికి ఆ పాట షూట్‌ అప్పుడు ఆ ప్రాంతం మొత్తం చలిగాలితో నిండిపోయి ఉంది. అలాంటి లొకేషన్స్‌లో షూట్‌ చేయడం ఇబ్బందిగా అనిపించింది.

‘పఠాన్‌’ షూటింగ్ గురించి మాట్లాడిన దీపిక..

‘‘నాకు సినిమా ఎన్నో అనుభవాలను ఇచ్చింది. అందుకే నాకు సినిమాలు ఎంతో ప్రత్యేకమైనది. నేను ఎక్కువ సమయాన్ని నటించడానికి కేటాయిస్తున్నాను. ‘పఠాన్‌’ సినిమా షూటింగ్‌ సమయంలో మనమంతా గొప్ప సమయాన్ని గడిపామని నేను భావిస్తున్నాను. మేము ఎంతలా ఎంజాయ్‌ చేశామో సినిమాలో కనిపిస్తుంది. పాటల్లో కచ్చితంగా మీరు చూస్తారు. మంచి వ్యక్తులతో సమయాన్ని గడపమని షారుక్‌ నాకు సలహా ఇచ్చారు. నేను అదే చేశాను’’ అని దీపిక చెప్పుకొచ్చారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు