Deepika Padukone: ఎన్టీఆర్‌ మంచి వ్యక్తి.. ఆ విషయంలో అతడే స్ఫూర్తి: దీపిక

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మంచి వ్యక్తిత్వం కలిగిన వారని నటి దీపికా పదుకొణె ప్రశంసించారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘గెహ్రాహియా‌’ ప్రమోషన్స్‌లో దీపిక పాల్గొంటున్నారు..

Published : 12 Feb 2022 02:16 IST

ముంబయి: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ మంచి వ్యక్తిత్వం కలిగిన వారని నటి దీపికా పదుకొణె ప్రశంసించారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘గెహ్రాహియా‌’ ప్రమోషన్స్‌లో దీపిక పాల్గొంటున్నారు. షకున్‌ బత్రా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో దీపిక కీలకపాత్ర పోషించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా శుక్రవారం నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దీపిక ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన తదుపరి ప్రాజెక్ట్‌లపై మాట్లాడారు. ‘ప్రాజెక్ట్‌ కె’తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని చెప్పారు.

‘‘గెహ్రాహియా’ కొత్తతరం ప్రేమకథా చిత్రం. షకున్‌ బత్రా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అనన్యతో కలిసి వర్క్‌ చేయడం నచ్చింది. మేమిద్దరం సెట్‌లో బాగా ఎంజాయ్‌ చేశాం. కథ డిమాండ్‌ చేయడం వల్లనే ఇందులో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించాను. ఇక, ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం ప్రభాస్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. అనంతరం విలేకరి.. తెలుగులో మీకు బాగా నచ్చిన హీరోలు ఎవరు? అని ప్రశ్నించగా.. ‘‘నాకు అల్లు అర్జున్‌, తారక్‌ అంటే అభిమానం. ఇక, తారక్‌ మంచి వ్యక్తి. ఆయన నటన, డైలాగ్‌ డెలివరీ నుంచి నేను స్ఫూర్తి పొందాను. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఉంది’’ అని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు