Deepika Padukone: లేడీ సింగం
రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్‌లో భాగంగా ‘సింగం’ సిరీస్‌లో మూడో చిత్రంగా ‘సింగం ఎగైన్’ రానున్న విషయం తెలిసిందే.
రోహిత్ శెట్టి (Rohit Shetty) కాప్ యూనివర్స్‌లో భాగంగా ‘సింగం’ (Singham) సిరీస్‌లో మూడో చిత్రంగా ‘సింగం ఎగైన్’ రానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పోలీస్ అధికారిగా మూడోసారి అజయ్‌దేవ్‌గణ్ సందడి ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దాంతో పాటు ఈ సినిమాలో కథానాయిక ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం ‘సర్కస్’ సినిమా వేడుకలో రోహిత్ శెట్టే చెప్పేశారు. ఈ చిత్రంలోని ‘కరెంట్ లగా రే..’ పాట విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఈ పాటలో రణ్‌వీర్‌సింగ్ సరసన ఆడిపాడింది దీపికా పదుకొణె (Deepika Padukone). ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ తర్వాత తిరిగి దీపకతో మళ్లీ ఎప్పుడు పని చేస్తారు? అని రోహిత్శెట్టిని ఈ వేడుకలో పాత్రికేయులు అడగ్గా..‘ఈమే మా లేడీ సింగం’ అంటూ దీపిక పేరుని ప్రకటించారు రోహిత్. వచ్చే ఏడాది సాధ్యమైనంత తొందరగా కలిసి పనిచేస్తాం అని ఆయన చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Supeme Court: అహోబిలం మఠం కేసు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఎదురుదెబ్బ
-
Politics News
Maharashtra: మహారాష్ట్ర నూతన గవర్నర్‌గా కెప్టెన్ అమరీందర్ సింగ్..?
-
General News
JEE Main 2023: జేఈఈ మెయిన్ JAN 28- 30 అడ్మిట్ కార్డులొచ్చేశాయ్.. డౌన్లోడ్ చేసుకోండిలా!
-
Movies News
Rajinikanth: మద్యానికి బానిసైన నన్ను ఆమె ఎంతో మార్చింది..: రజనీకాంత్
-
India News
Cheetahs: మళ్లీ ఎగిరొస్తున్న చీతాలు.. ఈసారి ఎక్కడినుంచంటే..?
-
Movies News
Jamuna: ఏడాదిపాటు మాట్లాడుకోని సావిత్రి - జమున