Deepika Padukone: షారుక్‌ చిత్రంలో అతిథిగా!

దీపికా పదుకొణె, షారుక్‌ఖాన్‌లది హిట్‌ కాంబినేషన్‌. ప్రస్తుతం ఈ కలయికలో ‘పఠాన్‌’ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి షారుక్‌ చిత్రంలో దీపిక ఆడిపాడనుందని సమాచారం.

Updated : 24 Jun 2022 09:13 IST

దీపికా పదుకొణె(Deepika Pdukone), షారుక్‌ఖాన్‌లది(Shahrukh Khan) హిట్‌ కాంబినేషన్‌. ప్రస్తుతం ఈ కలయికలో ‘పఠాన్‌’(Pathaan) చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి షారుక్‌ చిత్రంలో దీపిక ఆడిపాడనుందని సమాచారం. అట్లీ(Atlee) దర్శకత్వంలో షారుక్‌ నటిస్తున్న చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇందులో అతిథి పాత్రలో దీపిక సందడి చేయనుందట. ఆమె సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపిందని, ఒప్పందం జరగాల్సి ఉందని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని