Deepika Padukone: ఆస్కార్‌ ప్రజెంటర్‌గా దీపికా పదుకొణె.. ఫొటో షేర్‌ చేసిన నటి

అకాడమీ అవార్డుల (Oscars) ప్రదానోత్సవంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) సందడి చేయనున్నారు. ఈ ఏడాది ఆమె ఆస్కార్‌ అవార్డుల ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. 

Updated : 03 Mar 2023 18:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) మరో విశేష గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రపంచ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ (Oscars) అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ప్రజెంటర్‌గా పాల్గొననున్నారు. ఎమిలీ బ్లంట్‌, మైఖెల్‌ బి జోర్డాన్‌, శామ్యూల్‌ ఎల్‌ జాక్సన్‌, డ్వేన్‌ జాన్సన్‌, జోయ్‌ సాల్డానా వంటి హాలీవుడ్‌ ప్రముఖులతో కలిసి దీపిక.. అకాడమీ అవార్డులు అందించనున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలియజేసిన ఆమె ఇలాంటి గౌరవాన్ని సొంతం చేసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు, గతేడాది జరిగిన కేన్స్‌ ఫెస్టివల్‌లో జ్యూరీ సభ్యురాలు, ఫిఫా వరల్డ్‌ కప్‌ ప్రజెంటర్‌గానూ దీపిక వ్యవహరించారు.

మార్చి 12న జరగనున్న ఆస్కార్‌ (Oscars) అవార్డుల ప్రదానోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక జరగనుంది. హాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు. మన దేశం తరఫు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) బృందం ఇందులో పాల్గొననుంది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యింది. కాలభైరవ, రాహుల్‌ లైవ్‌లో ఈ పాటను ఆలపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని