SSMB29: మహేశ్ సినిమాలో దీపికా పదుకొణె...!

మహేశ్‌-రాజమౌళిల సినిమాపై రోజుకొక వార్త సంచలనం సృష్టిస్తోంది. నిన్నటి వరకు ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో తమిళ హీరో కార్తి ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

Published : 18 Oct 2022 17:56 IST

హైదరాబాద్‌: రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు(Mahesh Babu) ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇంకా పేరు ఖరారుకాని ఈ చిత్రాన్ని ‘SSMB29’గా పిలుస్తున్నారు. ఈ సినిమాపై రోజుకొక వార్త సంచలనం సృష్టిస్తోంది. నిన్నటి వరకు ఈ భారీ బడ్జెట్‌ చిత్రంలో తమిళ హీరో కార్తి ఉన్నారంటూ ప్రచారం జరిగింది. ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక దీపికా పదుకొణె(Deepika Padukone) ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నారట. చిత్రబృందం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయిన ఈ వార్త మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.

యాక్షన్‌ ప్రధానంగా రానున్న ఈ సినిమా రాజమౌళి కెరీర్‌లోనే అతి పెద్ద చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో కె.ఎల్‌. నారాయణ నిర్మించనున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) (Project K)లో దీపికా నటిస్తోంది. నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) కీలకపాత్ర పోషిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని