భన్సాలీ ‘బైజు బావ్రా’లో రూపమతిగా దీపికా?

బాలీవుడ్ చిత్రసీమలో సంజయ్‌ లీలా భన్సాలీకి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరుంది. అదే విధంగా కథానాయికగా దీపికా పదుకొణె సైతం తను ఎంచుకొనే పాత్రల్లో వైవిధ్యతను కనబరుస్తుంది. ప్రస్తుతం సంజయ్‌ ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది.

Updated : 25 May 2021 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్ చిత్రసీమలో సంజయ్‌ లీలా భన్సాలీకి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరుంది. అదే విధంగా కథానాయికగా దీపికా పదుకొణె సైతం తను ఎంచుకొనే పాత్రల్లో వైవిధ్యతను కనబరుస్తుంది. ప్రస్తుతం సంజయ్‌ ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’లోని ‘మేడమ్‌ ఆఫ్‌ కామతిపుర’ ఆధారంగా చిత్రం తెరకెక్కతుంది. ఈ సినిమా తర్వాత ఆయన ‘బైజు బావ్రా’ అనే సినిమాని తెరకెక్కించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో డెకాయిట్ రూపమతి అనే పాత్రని నటి దీపికా పదుకొణె పోషించనుందట. ఈ పాత్ర కోసం ఇప్పటికే సంజయ్‌ - దీపికాతో కలిసి పలుమార్లు చర్చలు కూడా జరిపారట. ఇంకా కొన్ని విషయాలపై చర్చలు కొనసాగుతున్నాయట. చిత్రానికి సంబంధించి స్క్రిప్టు కూడా ఇంకా పూర్తి కాలేదట. 2022 నాటికి సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలోని ఇతర నటీనటుల కోసం సంప్రదింపులు జరిపే పనిలో ఉన్నారట. సినిమాకి సంబంధించి అన్ని హంగులు సమకూరగానే సంజయ్‌ అధికారిక ప్రకటన చేయనున్నాడట. గతంలో వీరిద్దరూ కలిసి ‘గోలియో కి రాస్‌లీలా రామ్ లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘పద్మావత్’లాంటి బ్లాక్ బస్టర్లను ప్రేక్షకులకు అందించారు. అందుకే ‘బైజు బావ్రా’ సినిమా గురించి కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం దీపికా పదుకొణె తన భర్తతో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ‘83’లో నటించింది. జూన్‌ 4న సినిమా విడుదల కానుంది. ఇక షారుఖ్‌ ఖాన్‌ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పఠాన్‌’లో కథానాయికగా నటిస్తుంది. ఇక తెలుగులో నాగ్‌అశ్విన్‌ దర్శత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ప్రభాస్ సరసన నటించనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు