మీ మనసుకు హత్తుకునే సినిమా ఇది: బన్నీ

‘చావు కబురు చల్లగా’ ఎంతో మెచ్యురిటీతో తీసిన సినిమా.. నాకు నచ్చింది మీకూ నచ్చుతుందని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా ‘చావు కబురు చల్లగా’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ

Updated : 09 Mar 2021 23:25 IST

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చావు కబురు చల్లగా’ ఎంతో మెచ్యురిటీతో తీసిన సినిమా.. నాకు నచ్చింది మీకూ నచ్చుతుందని స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అన్నారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా ‘చావు కబురు చల్లగా’ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కౌషిక్‌ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్‌బిజోయ్‌ సంగీతం అందించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది. 
అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. ‘మొదట చెప్పాల్సిన పేరు బన్నివాసు. నా మీద ఎంత ఇష్టంతో ఆయన పేరులో నాపేరు పెట్టుకుంటారో అర్థం చేసుకోండి. మా ఇద్దరిది 18 సంవత్సరాల ప్రయాణం. గంగోత్రి నుంచి కలిసి పనిచేస్తున్నాం. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే.. మా నాన్న ఎంత కారణమో.. ఆ తర్వాత బన్నీవాసు అంతే కారణం. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే.. సినిమా నేను చూశాను. నాకు బాగా నచ్చింది. మీకు కూడా కచ్చితంగా నచ్చుతుంది. మీ మనసుకు హత్తుకునే సినిమా ఇది. డైరెక్టర్‌ కౌశిక్‌.. 26-27 సంవత్సరాలకే ఇలాంటి మెచ్యూరిటీతో సినిమా తీయగలిగాడా..! అని ఆశ్చర్యపోయాను. సినిమా చాలా అద్భుతంగా చేశాడు. కార్తికేయ మీ గుండెలను గుచ్చుకుంటాడు’ అని అల్లు అర్జున్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు