Bandla Ganesh: బండ్ల గణేశ్‌ ‘డేగల బాబ్జీ’.. ఆది ‘బ్లాక్‌’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

బండ్ల గణేశ్‌ నటించిన ‘డేగల బాబ్జీ’, ఆది సాయికుమార్‌ నటించిన ‘బ్లాక్‌’ చిత్రాల విడుదల తేదీ ఖరారైంది. ఏ సినిమా ఎప్పుడొస్తుందంటే?

Updated : 15 Aug 2022 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు, నిర్మాతగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన బండ్ల గణేశ్‌ ‘డేగల బాబ్జీ’తో చిత్రంతో కథానాయకుడిగా మారాడు. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో దర్శకుడు వెంకట్‌ చంద్ర తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకురానుంది. గణేశ్‌.. సంబంధిత పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ఎస్‌. స్వాతి నిర్మించిన ఈ సినిమాలో గణేశ్‌ పలు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

కొత్త తేదీతో..

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా జి. బి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లాక్‌’. మహంకాళి మూవీస్‌ పతాకంపై మహంకాళి దివాకర్‌ నిర్మించారు. ఈ సినిమాని ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావించినా సాధ్యపడలేదు. రంజాన్‌ సందర్భంగా కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. మే 28న రిలీజ్‌ చేస్తున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. దర్శన బానిక్‌, కౌశల్‌ మందా, ఆమని, పృథ్వీరాజ్‌, సూర్య, సత్యం రాజేశ్‌, తాగుబోతు రమేశ్‌, ఆనంద్‌ చక్రపాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, కూర్పు: అమర్‌రెడ్డి, కళ: కె.వి.రమణ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని