Dejavu: అమెజాన్ ప్రైమ్‌లో అలరిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘డెజావు’
కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘డెజావు’. ఈ ఏడాది జులైలో తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్‌డెస్క్: కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘డెజావు’. ఈ ఏడాది జులైలో తమిళంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అరుళ్‌నిధి, మధుబాల, స్మృతి వెంకట్, అచ్యుత్ కుమార్, కాళీ వెంకట్, మీమీ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. అరవింద్ శ్రీనివాసన్ దర్శకుడు. ఆసక్తికర కథా, కథనాలతో సినిమాను తీర్చదిద్దిన విధానం మెప్పిస్తోంది. ఒక నవల రచయిత ఊహించిన పాత్రలు సజీవంగా వచ్చి అతన్ని బెదిరించినప్పుడు ఏం జరిగింది? కల్పన అనేది భయానక వాస్తవంగా మారినప్పుడు ఏమైంది? అనేది ఈ చిత్రంలో చూపించారు. నిర్మాత రాజశేఖర్ అన్నభీమోజు దీన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓటీటీలో తీసుకువచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో సింగపూర్ సీజేఐ
-
Politics News
Nara Lokesh-yuvagalam: లోకేశ్ బహిరంగసభను అడ్డుకున్న పోలీసులు.. బంగారుపాళ్యంలో ఉద్రిక్తత
-
Movies News
Samantha: ఎనిమిది నెలలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా: సమంత
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
ICAI CA exam results: సీఏ ఫౌండేషన్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
Politics News
TS Assembly: బడ్జెట్ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి