COVID Vaccine: ఎడిటింగ్‌.. ఏముందబ్బా

కరోనా వైరస్‌ నుంచి కొంతవరకూ బయటపడాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రభుత్వం, వైద్య అధికారులు చెబుతున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్‌ డ్రైవ్‌ గురించి...

Published : 22 May 2021 16:27 IST

వైరల్‌గా మారిన ‘దేశముదురు’ వీడియో

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నుంచి కొంతవరకూ బయటపడాలంటే వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ప్రభుత్వం, వైద్య అధికారులు చెబుతున్నారు. సినీ సెలబ్రిటీలు సైతం వ్యాక్సిన్‌ డ్రైవ్‌ గురించి ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది మాత్రం వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి సుముఖంగా లేరు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్‌పై అవగాహన కల్పిస్తూ ఇంటర్నెట్‌లో పలు వీడియోలు, మీమ్స్‌ దర్శనమిస్తున్నాయి.

కాగా, వ్యాక్సిన్‌ వేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదంటూ తాజాగా ఓ మీమర్స్‌ పేజ్‌ స్పెషల్‌ వీడియో క్రియేట్‌ చేసింది. ‘దేశముదురు’లోని ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఫైట్‌ సీక్వెన్స్‌ని వ్యాక్సిన్‌ డ్రైవ్‌కి అనుగుణంగా మార్చి విడుదల చేశారు. అంతేకాక నటీనటులకు సైతం ప్రస్తుతానికి సరిపడా డైలాగ్స్‌తో డబ్బింగ్‌ చెప్పారు. తనని కొట్టడానికి వచ్చే విలన్‌ని.. ‘సామాజిక దూరం పాటించురా. ముట్టుకోకు’  అంటూ హీరో కొట్టడం.. అలాగే హన్సికను(వైశాలి) చూసి.. ‘వ్యాక్సిన్‌ వేయించుకోవడానికే కదా నువ్వు వచ్చావ్‌’ అంటూ హీరో అడగడం వంటి సంభాషణలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూసినవారందరూ ‘డబ్బింగ్‌ అదుర్స్‌’ అంటూ పోస్టులు పెడుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని