Yash: రాఖీభాయ్‌ రాజసం.. రూ.6కోట్ల విలువైన కార్లు.. డుప్లెక్స్‌ హౌస్‌..

‘కేజీయఫ్‌’ బాక్స్‌ ఆఫీసు వద్ద బ్లాక్‌బాస్టర్‌గా నిలిచి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతో విజయాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు యశ్‌.

Published : 27 Apr 2022 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీయఫ్‌-2’(KGF) బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాతో విజయాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు యశ్‌. ఈ సినిమా సాధించిన విజయంతో కన్నడ హీరో యశ్ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. రాఖీభాయ్‌గా స్టైల్‌, యాక్షన్‌తో అద్భుతంగా డైలాగ్స్‌ చెప్పి యూత్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ఈ స్టార్‌ హీరో గురించి తెలుసుకోవాలని అభిమానులు వెబ్‌సైట్స్‌లో తెగ వెతికేస్తున్నారు. కేజీయఫ్‌ స్టార్‌ ఎక్కడ ఉంటాడు? ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటారు? ఏ కారును వాడతారో అందరికీ తెలుసుకోవాలని ఉంది.

విలాసవంతమైన భవనం, ఖరీదైన కార్లు 

ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న యశ్‌కు బెంగళూర్‌లో ఒక అందమైన డుప్లెక్స్‌ ఇల్లు ఉంది. ప్రస్తుతం తన భార్య, ఇద్దరు పిల్లలతో అందులోనే నివాసముంటున్నాడు. ఈ రాఖీభాయ్‌కు ఖరీదైన కార్లు ఉన్నాయి. రూ.80 లక్షలు విలువచేసే ఆడీ క్యూ7, రూ.70లక్షల బీఎమ్‌డబ్ల్యూ 520డితో పాటు రూ.40 లక్షల విలువచేసే స్పోర్ట్స్‌ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా రూ.85 లక్షల మెర్సిడెస్‌ బెంజ్‌తో పాటు రేంజ్‌ రోవర్‌ కారును వాడుతున్నాడు ఈ హీరో. 

ప్రచార కర్తగా

‘కేజీయఫ్‌’తో తనే ఒక బ్రాండ్‌గా ఎదిగిన యశ్‌ కొన్ని ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. వాటిలో మొబైల్‌ సంస్థ సెల్కాన్‌ మొబైల్స్‌, అలాగే బియర్డోతో పాటు బ్రెయిన్‌చిల్డ్‌ వంటి ఫర్‌ఫ్యూమ్స్‌ల ప్రచార బాధ్యతలు తీసుకున్నాడు. ఒక్కో బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసినందుకు సుమారు రూ.60లక్షల నుంచి రూ.కోటి దాకా తీసుకుంటాడని తెలుస్తోంది.

‘కేజీయఫ్‌’కు ముందు తర్వాత..

యశ్‌ ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నట్లుగానే తన జీవితం ‘కేజీయఫ్‌’కు తర్వాత  పూర్తిగా మారిపోయింది. టీవీ సీరియల్‌ నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన యశ్‌ ‘కేజీయఫ్‌’తో పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని