Devara: ‘దేవర’ రిలీజ్‌ డేట్‌ మారింది.. ముందే వస్తున్నాడు

ఎన్టీఆర్‌ హీరోగా డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవర’. ఈ సినిమా విడుదల తేదీ మారింది.

Published : 13 Jun 2024 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్టు ‘దేవర’ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకురానుంది. సెప్టెంబరు 27న ‘దేవర’ (Devara) పార్ట్‌ 1ను రిలీజ్‌ చేయనున్నట్టు చిత్ర బృందం గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ విడుదల చేసింది (Devara New Release Date).

డేటింగ్‌ వార్తలపై స్పందించిన మమతా మోహన్‌ దాస్‌.. ఏమన్నారంటే

‘జనతా గ్యారేజ్‌’ తర్వాత హీరో ఎన్టీఆర్‌- డైరెక్టర్‌ కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ వేసవిలోనే తొలి భాగం విడుదల కావాల్సిఉండగా అక్టోబరు 10కి వాయిదా పడింది. పనులు శరవేగంగా జరుగుతుండడంతో ‘దేవర’ టీమ్‌ సెప్టెంబరు 27ని ఖరారు చేసినట్టు తెలిసింది. విస్మరణకు గురైన ఓ తీర ప్రాంత నేపథ్య కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిత్రీకరణ ముగింపు దశలో ఉంది.

మరోవైపు, పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటిస్తున్న ‘ఓజీ’ (OG) సెప్టెంబరు 27నే ఫిక్స్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా చిత్రీకరణ మిగిలిఉంది. ‘దేవర’ ప్రకటనతో ‘ఓజీ’ వాయిదా పడినట్టే అని స్పష్టమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని