Devil: ‘డెవిల్‌’గా కల్యాణ్‌రామ్‌.. 500 మందితో అదిరిపోయే ఫైట్‌

కల్యాణ్‌రామ్‌ హీరోగా నవీన్‌ మేడారం తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘డెవిల్‌’. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ జరుగుతోందని నిర్మాత అభిషేక్‌ నామా తెలిపారు.

Published : 29 Mar 2023 22:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బింబిసార’ (Bimbisara)తో గతేడాది మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram). ప్రస్తుతం ఆయన ‘డెవిల్‌’ (Devil) చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా దర్శకుడు నవీన్‌ మేడారం తెరకెక్కిస్తున్నారు. అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఫైట్‌ మాస్టర్‌ వెంకట్‌ ఆధ్వర్యంలో 500 మందితో పోరాట దృశ్యాల్ని చిత్రీకరిస్తున్నారు. అది టాలీవుడ్‌లోనే ది బెస్ట్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌గా ఉండబోతోందని చిత్ర బృందం తెలిపింది.

షూటింగ్‌ క్లైమాక్స్‌కు చేరుకున్న సందర్భంగా అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాం. కల్యాణ్‌రామ్‌ కొత్త అవతార్‌లో ఆకట్టుకుంటారు. ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం రూపొందిస్తున్న ఫైట్‌ సీన్‌ని తెరపై చూస్తే వావ్ అనాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ త్వరలోనే తెలియ‌జేస్తాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, ఛాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌ ఎస్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు