Dhaakad: కంగనా ‘ధాకడ్‌’.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ కెరీర్‌లో అతి పెద్ద ఫ్లాప్‌ మూవీ ‘ధాకడ్‌’. మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ పరాజయాన్ని

Published : 20 Jun 2022 19:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ కెరీర్‌లో అతి పెద్ద ఫ్లాప్‌ మూవీ ‘ధాకడ్‌’. మే 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. రజనీష్‌ ఘయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్‌ మూవీ సగటు ప్రేక్షకుడిని మెప్పించటంలో విఫలమైంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. జీ5 ఓటీటీలో జులై 1వ తేదీ నుంచి ‘ధాకడ్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో కంగనా ఏజెంట్‌ అగ్ని పాత్రలో కనిపించారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఏజెంట్‌ అగ్ని.. అతి క్రూరుడైన ప్రతినాయకుడు రుద్రవీర్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది? మరి అతడిని ఎలా ఎదుర్కొంది? అందుకు ఏం చేసింది? అన్నది చిత్ర కథ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని