Dhamaka: ‘యాక్షన్‌లోకి దిగితే.. నేనొక శాడిస్ట్‌ని’.. అదరగొట్టేలా ‘ధమాకా’ క్రాకర్‌

‘ఖిలాడి’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రాల తర్వాత రవితేజ నటించిన సరికొత్త సినిమా ‘ధమాకా’. నక్కిన త్రినాథరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Published : 21 Oct 2022 11:45 IST

హైదరాబాద్‌: యాక్షన్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల (SreeLeela) కథానాయిక. దీపావళి వేడుకల సందర్భంగా చిత్రబృందం తాజాగా టీజర్‌ విడుదల చేసింది. ‘ధమాకా మాస్‌ క్రాకర్‌’ పేరుతో విడుదలైన ఈ టీజర్‌.. రవితేజ మాస్‌ డైలాగ్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఆకట్టుకునేలా ఉంది.

‘‘నేను నీలో ఒక విలన్‌ని చూస్తే.. నువ్వు నాలోని హీరోని చూస్తావు. కానీ, యాక్షన్‌లోకి దిగినప్పుడు నేనొక శాడిస్ట్‌ని’’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ‘‘అటు నుంచి ఒక బుల్లెట్‌ వస్తే ఇటు నుంచి దీపావళే’’ అంటూ చివర్లో రవితేజ.. విలన్‌కు వార్నింగ్‌ ఇవ్వడం మాస్‌ ఆడియన్స్‌తో ఈలలు వేయించేలా ఉంది. జయరాం, సచిన్ ఖేడేకర్‌, తనికెళ్ల భరణి, రావు రమేశ్‌, ఆలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని