Dhamaka: దీపావళికి మాస్‌ క్రాకర్‌

దీపావళిని పురస్కరించుకుని రవితేజ మాస్‌ క్రాకర్‌ని పేల్చనున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న ‘ధమాకా’ టీజర్‌ని అక్టోబరు 21న విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి.

Updated : 07 Oct 2022 06:56 IST

దీపావళిని పురస్కరించుకుని రవితేజ (Raviteja) మాస్‌ క్రాకర్‌ని పేల్చనున్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న ‘ధమాకా’ (Dhamaka) టీజర్‌ని అక్టోబరు 21న విడుదల చేయనున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజకి జోడీగా శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. ప్రసన్నకుమార్‌ బెజవాడ కథ, మాటలు అందించారు. రవితేజ మార్క్‌ వినోదంతో రూపొందుతున్న ఈ సినిమా టీజర్‌ని మాస్‌ క్రాకర్‌ పేరుతో విడుదల చేస్తున్నామని, త్వరలోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు