Dhamaka: ఇకపై పండగ మీద పండగే

‘‘ధమాకా’కి అభిమానులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. పండగ చేసుకొని రెండేళ్లయింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంతో పండగొచ్చింది. ఇకపై పండక్కి గ్యాప్‌ ఇవ్వొద్దు.

Updated : 31 Dec 2022 06:52 IST

‘‘ధమాకా’కి (Dhamaka) అభిమానులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. పండగ చేసుకొని రెండేళ్లయింది. మళ్లీ ఇప్పుడు ఈ చిత్రంతో పండగొచ్చింది. ఇకపై పండక్కి గ్యాప్‌ ఇవ్వొద్దు. పండగ మీద పండగ చేసుకోవాలి’’ అన్నారు రవితేజ (Raviteja). ఆయన.. శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లో మాస్‌ సక్సెస్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర విజయానికి తొలి కారణం.. మా సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో. ఈ సినిమాకి సాలిడ్‌ సౌండ్‌ ఇచ్చాడు. తన సంగీతంతో చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. పీపుల్స్‌ మీడియా ఈ సినిమాని ఎంతో చక్కగా ప్రమోట్‌ చేశారు. ఈ బ్యానర్‌లో మరిన్ని సూపర్‌ హిట్లు రావాలి. నాయిక శ్రీలీల ఈ చిత్రానికి మరో ఆకర్షణ. తను రాబోయే రోజుల్లో పెద్ద స్టార్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘రవితేజ డ్రమ్ము వాయిస్తేనే ఆరోజుల్లో ‘అల్లరి ప్రియుడు’ 250రోజులు ఆడింది. ఇప్పుడు డ్రమ్ము వాయిస్తే థియేటర్లు దద్దరిల్లిపోయాయి’’ అన్నారు దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఈ కార్యక్రమంలో హరీష్‌ శంకర్‌, త్రినాథరావు, శ్రీలీల, వివేక్‌ కూచిభొట్ల, భీమ్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని