Dhamaka: ‘ధమాకా’తో మరోసారి గేట్లు తెరిచారు!

రవితేజ (Raviteja), శ్రీలీల (SreeLeela) జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. జయరామ్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు.

Updated : 09 Jan 2023 06:55 IST

వితేజ (Raviteja), శ్రీలీల (Sreeleela) జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. జయరామ్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రవితేజ (Raviteja) మాట్లాడుతూ.. ‘‘చాలా ఆనందంగా ఉంది. త్రినాథరావు, రచయిత ప్రసన్నకు అభినందనలు. శ్రీలీలకు శుభాకాంక్షలు. భీమ్స్‌ ఇలాగే ఇరగదీసేయాలి. నిర్మాతలు చాలా పాజిటివ్‌గా ఉంటారు. సినిమాని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు’’ అన్నారు. ‘‘ఇంత పెద్ద సక్సెస్‌ రావడం ఆనందంగా ఉంది. రవితేజ నాలో గొప్ప ఆత్మవిశ్వాసం నింపారు’’ అంది శ్రీలీల. దర్శకుడు త్రినాథరావు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కోసం మా చిత్ర బృందమంతా ఎంతో కష్టపడింది. వాళ్లందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ విజయంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్‌ చాలా సంతోషంగా ఉన్నారు. రవితేజ నాకు గొప్ప అవకాశమిచ్చారు. అందరినీ ప్రోత్సహిస్తూ.. సినిమాని ఇక్కడి వరకు తీసుకొచ్చారు’’ అన్నారు. ‘‘చిత్రం ఇంత పెద్ద విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు విశ్వప్రసాద్‌, వివేక్‌. రచయిత ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ తర్వాత ‘క్రాక్‌’ చిత్రంతో థియేటర్‌కు గేట్లు తెరిచారు రవితేజ. ఓటీటీ తర్వాత థియేటర్‌కు రారు అనుకునే సమయంలో ‘ధమాకా’తో మరోసారి గేట్లు తెరిచారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్స్‌ సిసిరోలియో, ప్రవీణ్‌ పూడి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని