Dhamaka: అట్నుంచి ఒక బుల్లెట్‌ వస్తే.. ఇట్నుంచి దీపావళి

రవితేజ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌.. అన్నది ఉపశీర్షిక. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

Updated : 22 Oct 2022 11:11 IST

వితేజ (Raviteja) కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). డబుల్‌ ఇంపాక్ట్‌.. అన్నది ఉపశీర్షిక. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శ్రీలీల (Sree Leela) కథానాయిక. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో డిసెంబర్‌ 23న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘‘నేను మీలో విలన్‌ను చూస్తే.. మీరు నాలో హీరోని చూస్తారు. కానీ, నేను యాక్షన్‌లో ఉన్నప్పుడు శాడిస్ట్‌ని’’ అంటూ రవితేజ ఇంగ్లీష్‌లో చెప్పిన డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ సినిమాలో ఆయన రెండు కోణాలున్న పాత్రలో సందడి చేయనున్నారు. ఇందులో యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు ప్రచార చిత్రాల్లో కనిపించిన సన్నివేశాల్ని బట్టి అర్థమవుతోంది. ‘‘అట్నుంచి ఒక బుల్లెట్‌ వస్తే.. ఇట్నుంచి దీపావళి’’ అంటూ ఆఖర్లో రవితేజ చెప్పిన డైలాగ్‌ టీజర్‌కు ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు