Dhamaka: కోట్లలో ఒకడాడు.. కొడితే కోలుకోలేవు!

కథానాయకుడు రవితేజ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ధమాకా’. త్రినాథరావు నక్కిన దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 16 Dec 2022 07:42 IST

కథానాయకుడు రవితేజ (Ravi teja) ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). త్రినాథరావు నక్కిన దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘కోట్లలో ఒకడాడు.. కొడితే కోలుకోలేవు’’ అనే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రవితేజ ఇందులో స్వామి అనే నిరుద్యోగిగా.. ఆనంద్‌ చక్రవర్తి అనే అపర కోటీశ్వరుడుగా రెండు పాత్రల్లో కనిపించారు. వీరిద్దరి దారులు వేరైనా.. ఒకే శత్రువుతో తలపడేందుకు ఇద్దరూ ఒక దగ్గర చేరాల్సి వస్తుంది. మరి అతనెవరు? తనకీ వీళ్దిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి? ఈ పోరులో అంతిమ విజయం ఎవరిది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.   ‘‘నేను వెనకున్నవాళ్లని చూసుకొని ముందుకొచ్చిన వాడ్ని కాదురోయ్‌. వెనక ఎవడూ లేకపోయినా ముందుకు రావొచ్చు.. అనే ఎగ్జాంపుల్‌ సెట్‌ చేసిన వాణ్ని’’ అంటూ ఆఖర్లో రవితేజ చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు