Dhamaka: ట్రైలర్‌తో ‘ధమాకా’

‘ధమాకా’తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శ్రీలీల కథానాయిక.

Updated : 12 Dec 2022 07:23 IST

‘ధమాకా’తో (Dhamaka) వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు రవితేజ (Raviteja). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 15న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రంలో రవితేజ సూట్‌ ధరించి.. కళ్లజోడుతో స్టైలిష్‌గా కనిపించారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాకి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీత దర్శకుడు. కార్తీక్‌ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని