Dhanush: ‘జ‌గ‌మేతంత్రం’ విడుదలపై నిరాశ చెందా!

‘జ‌గ‌మే తంత్రం’ ఓటీటీ విడుద‌ల‌పై నిరాశ చెందాన‌ని అన్నారు త‌మిళ న‌టుడు ధ‌నుష్‌.

Updated : 07 Jul 2021 14:23 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘జ‌గ‌మే తంత్రం’ ఓటీటీ విడుద‌ల‌పై నిరాశ చెందాన‌ని అన్నారు త‌మిళ న‌టుడు ధ‌నుష్‌. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ధ‌నుష్ న‌టించిన ఈ చిత్రం జూన్ 18 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేప‌థ్యంలో జూన్ 7న ట్విట‌ర్ వేదిక‌గా పాట‌ల్ని విడుద‌ల చేసి, ద‌ర్శ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు, ధ‌నుష్, పాట‌ల ర‌చ‌యిత‌లు, గాయ‌కులు సినిమా గురించి ముచ్చ‌టించారు.

ధ‌నుష్ మాట్లాడుతూ.. ‘‘జ‌గ‌మే తంత్రం’ విడుద‌ల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. 2020లోనే థియేట‌ర్ల‌లో విడుద‌ల కావాల్సిన ఈ సినిమాని కొవిడ్ మ‌హ‌మ్మారి, ఇత‌ర కార‌ణాలతో నిర్మాత శ‌శికాంత్ ఓటీటీ వేదిక‌గా విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. థియేట‌ర్ల‌లో విడుద‌ల కాకుండా నేరుగా డిజిట‌ల్ మాధ్య‌మంలో ఈ చిత్రం వ‌స్తుండ‌టంతో కాస్త నిరాశ చెందాను. కానీ, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రాబోతుండ‌టంతో ఆనందంగానే ఉంది. దీని ద్వారా అధిక సంఖ్య‌లో ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని చూసే అవ‌కాశం ఉంది. క్లిష్ట ప‌రిస్థితుల్లో ఓ వినోద మార్గంగానూ నిలుస్తుంది. ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమా న‌చ్చుతుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నాను’’ అని తెలిపారు.

ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా క‌నిపించ‌నున్నారు ధనుష్‌. ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్‌, కలైయారసన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. వై నాట్‌ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచుతోంది. సంతోష్ నారాయ‌ణ్ అందించిన పాట‌లు శ్రోత‌ల్ని విశేషంగా అల‌రిస్తున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని