Dhanush: ఇంటర్నేషనల్‌ అవార్డుల బరిలో ధనుష్‌ సినిమా..

ధనుష్‌ హీరోగా నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ అవార్డుల్లో నామినేషన్‌ దక్కించుకుంది.

Published : 13 Jun 2024 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ధనుష్‌ హీరోగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ధనుష్‌ నటనకు విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్‌ అవార్డుల బరిలో నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణసంస్థ పోస్ట్‌ పెట్టింది.

డేటింగ్‌ వార్తలపై స్పందించిన మమతా మోహన్‌ దాస్‌.. ఏమన్నారంటే

ధనుష్‌ (Dhanush) సరసన ప్రియాంక మోహన్‌ నటించిన ఈ చిత్రం రూ.100 కోట్లు వసూలు చేసి ఈ హీరో కెరీర్‌లో హిట్‌ లిస్ట్‌లో చేరింది. తాజాగా ఈ సినిమా లండన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ 2024లో నామినేషన్‌ దక్కించుకుంది. ఉత్తమ విదేశీ సినిమా విభాగంలో నామినేట్‌ అయింది. ఇక ఇదే క్యాటగిరీలో భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రలో నటించిన ‘భక్షక్‌’ (Bhakshak) కూడా నామినేషన్‌ దక్కించుకుంది. పలు హాలీవుడ్‌ చిత్రాలతో ఈ సినిమాలు పోటీ పడనున్నాయి. దీంతో అభిమానులు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. ప్రస్తుతం ధనుష్‌ ‘రాయన్‌’లో నటిస్తున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ధనుష్‌ 50వ చిత్రం కావడం విశేషం. జులై 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జె.సూర్య, కాళిదాస్‌ జయరామ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని