Maaran: ఓటీటీలోకి ధనుష్‌ ‘మారన్‌’.. అలరిస్తున్న ట్రైలర్‌

ధనుష్‌ నటించిన కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు ‘మారన్‌’ చిత్రం సిద్ధమైంది.

Published : 28 Feb 2022 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పుడు మరో చిత్రం ‘మారన్‌’ సిద్ధమైంది. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వం వహించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో మార్చి 11 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. యాక్షన్‌, కామెడీ సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. ఈ సినిమాలో ధనుష్‌ జర్నలిస్టుగా కనిపించనున్నారు. ఆయన సరసన మాళవిక మోహనన్‌ సందడి చేయనుంది. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు