Dhanush: ఒకే ఫ్రేమ్‌లో ధనుష్‌- శేఖర్‌

తమిళ నటుడు ధనుష్‌ హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Published : 03 Jul 2021 01:16 IST

హైదరాబాద్‌: తమిళ నటుడు ధనుష్‌ హీరోగా టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌ వచ్చిన ధనుష్‌ ఈ సినిమా నిర్మాతల్ని, దర్శకుడు శేఖర్‌ కమ్ములని శుక్రవారం కలిశారు. ఒకే ఫ్రేమ్‌లో ధనుష్‌- శేఖర్‌ కనిపించడంతో నెట్టింట సందడి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇతర తారాగణం, టైటిల్‌, సాంకేతిక వర్గ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. మరోవైపు ‘లవ్‌స్టోరీ’ చిత్రంతో బిజీగా ఉన్నారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రమిది. బాలీవుడ్‌ సినిమా ‘అత్రాంగి రే’, హాలీవుడ్‌ చిత్రం ‘ది గ్రే మ్యాన్‌’తో బిజీగా ఉన్నారు ధనుష్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని