Dhanush: ‘సార్‌’.. నాకెంతో ప్రత్యేకం: ధనుష్‌

‘‘ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ అనే భాషా హద్దులు లేవు. మొత్తం భారతీయ చిత్రసీమే. చాలా మంచి పరిణామమిది’’ అన్నారు హీరో ధనుష్‌ (Dhanush).

Updated : 09 Feb 2023 06:57 IST

‘‘ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ అనే భాషా హద్దులు లేవు. మొత్తం భారతీయ చిత్రసీమే. చాలా మంచి పరిణామమిది’’ అన్నారు హీరో ధనుష్‌ (Dhanush). ఆయన.. సంయుక్తా మేనన్‌ (Samyuktha Menon) జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘సార్‌’ (SIR). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సముద్రఖని, సాయికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో ధనుష్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. ఎందుకంటే ఇది నా తొలి తెలుగు చిత్రం. తెలుగు, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న ఓ ఊరిలో జరిగే కథ ఇది. రెండు ప్రాంతాల సంస్కృతులు ఇందులో కనిపిస్తాయి. అందుకే ఇలాంటి కథలో భాగమైనందుకు సంతోషంగా అనిపించింది. కచ్చితంగా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ధనుష్‌ సర్‌కు కథ వినిపించిన వెంటనే ఆయన డేట్స్‌ ఎప్పుడు కావాలన్నారు. నా జీవితంలో మర్చిపోలేని క్షణాలివి’’ అన్నారు దర్శకుడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని